WhatsApp Image 2024 02 03 at 1.01.46 PM
Trinethram News : ఖమ్మం జిల్లా: ఖమ్మం పార్లమెంటు సీటు కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలంటూ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీగా హైదరాబాద్‌కు బయలు దేరారు..
అంతకుముందు ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మల్లు నందిని మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంటు సీటు ఆశిస్తున్నానని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ సోనియా గాంధీ, ప్రియాంక పోటీ చేసినా, లేక అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే అందరి లక్ష్యమని మల్లు నందిని స్పష్టం చేశారు..
