త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఇటీవల నూతనంగా సత్తుపల్లి డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ఊటుకూరి సునీత శుక్రవారం అశ్వారావుపేట బస్టాండ్ సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. బస్టాండ్ ప్రాంగణమంతా కలియ తిరి. కార్గో ఏజెంట్ కు తగు సూచనలు చేశారు. ఆటోలు ఇన్గేట్ వద్ద బస్సులు లోపలికి రాకుండా అడ్డుగా ఉంచడం మంచిది కాదని ఆటో డ్రైవర్లను పిలిచి వారికి తగు సూచనలు అందించారు. స్టాల్స్ ఎదురుగా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు. బస్టాండ్ పరిశుభ్రంగా ఉండాలని నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. డిపో మేనేజర్ వెంట అసిస్టెంట్ మేనేజర్ పి విజయ శ్రీ, విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు, కంట్రోలర్ ఆర్.వి. రావు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


