జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 11 at 18.05.50

TRINETHRAM NEWS

ఉరివేసుకుని యువకుని మృతి

మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్కు చెందిన ఊదురుకోట నవీన్ (33) అనే యువకుడు
జీవితంపై విరక్తితో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందమర్రి అదనపు ఎస్ఐ శ్రీనివాస్
తెలిపిన వివరాల ప్రకారం డీగ్రీ వరకు చదువుకున్న నవీన్ కారు డ్రైవర్
గా కొంత కాలం
పనిచేశాడు. గతంలో మార్కెట్ ఏరియాలో బిజినెస్ పెట్టి రాణించలేక పోయాడు. తలిదండ్రులు
ముసలివారు కావడంతో పాటు ప్రస్తుతం ఎలాంటి జీవనోపాది లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో
జీవితంపై విరక్తితో ఇంటి ఆవరణలోని వెనుక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి
లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page