
Deadline Extended : సత్యసాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 01 ; పెనుగొండ నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యురాలు, మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు. వాళ్లకు ఇప్పటికే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా త్వరలో కొత్త పెన్షన్ లు కూడా అందజేస్తామని వెల్లడించారు.
అయితే నేతన్నల సేవలో స్కీమ్ రెండో విడతలో 36 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సూచించారు. సంబంధిత లబ్ధిదారుల ఎంపిక గడువును ఈనెల 3వ తేదీ వరకు పొడ గించినట్లు చెప్పారు. రూపాయలు 25 వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe