
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15 : కూకట్పల్లి భరత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరయ్యారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో హోమం భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నాగిరెడ్డిని రమేష్ అభినందించారు. తన వంతు గా ఆలయ అభివృద్ధికి నిర్మాణానికి రూ 50 వేలను రమేష్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సత్యం శ్రీరంగం, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సాధు ప్రతాప్ రెడ్డి, తూము మనోజ్, లక్ష్మయ్య, డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ రాజ్ పుత్, శివ చౌదరి, జగదీష్ ,సంతోష్ , సంధ్య ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
