D. Madhavi, District Education Officer, is an impressive in-house innovator innovative innovation stall
పెద్దపల్లి, ఆగస్టు-15: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటింటా ఇన్నోవేటర్ వినూత్న ఆవిష్కరణల స్టాల్ అందర్నీ ఆకట్టుకుందని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి తెలిపారు.
గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ పరేడ్ మైదానంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “వినూత్న ఆవిష్కరణల స్టాల్ ” చూపరులను విశేషంగా ఆకట్టుకున్నదని తెలిపారు.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ గత ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనలో
ఈ సంవత్సరం జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థితో పాటు మరో 8ఎగ్జిబిట్స్ ఉత్తమంగా నిలిచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రదర్శనలో కనువిందు చేసినట్టు పేర్కొన్నారు.
జిల్లాలోని ఎలిగేడ్ మండలంలోని ధూళికట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి డి.జశ్వంత్ రూపొందించిన ప్రత్యేక కొడవలి రైతులకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది.
యువ టెక్నోక్రాట్ ఎం.జాహ్నావి గని కార్మికులకు ఉపయోగపడే రీతిలో తయారు చేసిన సురక్షితమైన ‘టోపి’ ఆకట్టుకున్నాయి.
మంథని నాగారం కు చెందిన యువ ఇంజనీర్ ఎం.శశిరత్ రెడ్డి తయారుచేసిన “ఎలక్ట్రిక్ పవర్ వీడర్” రైతులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. జి.ప్రదీప్ కుమార్ రూపొందించిన ‘వాడిన నూనెతో నడిచే పొయ్యి’, దూళికట్టకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జి.విష్ణు నడకతో విద్యుత్తును తయారుచేసిన “ఫూట్ స్టెప్ పవర్ జనరేషన్” అలరించిందని అన్నారు.
రొంపికుంట గ్రామానికి చెందిన జి.కుమార్ రైతులకు ఉపయుక్తమైన విధంగా రూపొందించిన ‘ఫెర్టిలైజర్ స్ప్రేయింగ్ మిషన్’, రామగుండంకు చెందిన యువ ఇంజనీర్ ఎస్.వర్షిణి తయారుచేసిన “మొబైల్ డిటెక్టర్” చాలా ఉపయుక్తంగా ఉందని అన్నారు. బంజరుపల్లికి చెందిన కె.సురేష్ రెడ్డి తయారుచేసిన గ్రావిటిల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన పల్లె రాజు ఫౌల్ట్రీ రైతులకు ఉపయుక్తంగా తయారుచేసిన చాలా తక్కువ కరెంట్ వినియోగంతో నడిచే “ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యూబేటర్” ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, జిల్లా కలెక్టర్ కోయ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు ఆవిష్కరణలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మహిళ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కటారి రేవతి రావు, అదనపు కలెక్టర్లు జె .అరుణ శ్యాం ప్రసాద్ లాల్, డి.సి.పి. ఎం.చేతన, ఆర్.డి.ఓ. బి.గంగయ్య, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App