వేములవాడలో భక్తుల రద్దీ

TRINETHRAM NEWS

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ:డిసెంబర్ 25
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

స్వామివారి దర్శించుకోవ డానికి భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతు న్నది. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దుచేశారు.

వేములవాడలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా చర్యలు తీసు కుంటున్నారు.

భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో మూడో రోజైన సోమవారం ముత్తంగి అలంకారంలో సీతారాముల వారు భక్తులకు దర్శనమి స్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top