ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు*).
అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ,
విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 10లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి
విద్యుత్ షాక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి
విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారి కుటుంబానికి, 10లక్షల చొప్పున 30 లక్షలు రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, సి.పి.ఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.
పెదబయలు మండలం, కిముడుపల్లి పంచాయతీ,గడుగుపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. హృదయ విదరమైన ఈ సంఘటన లో లక్ష్మి (32)
పిల్లలు ఇద్దరు కరెంట్ షాక్ తో తల్లి కొడుకు కూతురు మరణించారు. దీనిపై అధికారులు తక్షణమే విచారణ జరిపి, కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక గ్రామంలో ఒక కరెంటు స్తంభం మార్చాలంటే ఒక పర్మిషన్ తీసుకుని, కరెంటు స్తంభం మార్చవచ్చు .అన్ని స్తంభాలు జీవో టేకింగ్ చేసి ఉంటారు.ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతంలో జరగడం చాలా చింతిస్తున్నాము. ఈ రకమైన ఘటన దారుణమైంది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కనుక ఆ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోనీ నష్టపోయిన వారికి 10 లక్షల చొప్పున 30 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని సి.పి.ఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App