TRINETHRAM NEWS

సిపిఐ పార్టీ బృందం నగరి డీఎస్పీ ని మర్యాద పూర్వకంగా కలసారు

నగరి త్రినేత్రం న్యూస్. నగరి డీఎస్పీ నీ సిపిఐ పార్టీ బృందం కలవడం జరిగింది. ఈ సందర్భంగా నగరి జరిగిన కొన్ని సమస్యలను పరిష్కరించాలని డిఎస్పి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు కుశస్థిలి నదిలో ఇసుకను విచ్చలవిడిగా రోజుకు వందల ట్రాక్టర్లు ఇసుక తీస్తున్నారు కానీ ఇస్తే ఎక్కడికి వెళ్తా ఉంది ఎవరికి చేరుస్తున్నారని ప్రభుత్వ అధికారులకు దానిపైన అజమాయిషి లేదు. ట్రాక్టర్ రాత్రి సమయంలో కూడా విచ్చలవిడిగా ఇసుక తోలుతున్నారు. గతంలో నగరి మండలంలో ముడిపల్లి దగ్గర డంపింగ్ యార్డ్ ను పోలీస్ అధికారులు సీజ్ చేశారు అదేవిధంగా విజయపురం మండలంలో నారపరాజు కండ్రిగ దగ్గర పోలీస్ అధికారులు సీజ్ చేశారు.

ఇసుక పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇసుక తోలడానికి ఒక టైం ఉదయం 8 నుంచి సాయంత్రం 4:00 వరకు మాత్రమే ఇసుక తోలుకోవడానికి అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక తోలడం పైన కూడా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉండే విధంగా చూడాలని అప్పుడు ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు పోయే ఇసుకను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ని కోరడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ సమస్యలు సందర్భంగా ఉదయం 7:30 నుంచి 9:30 వరకు సాయంత్రం మూడున్నర నుంచి నాలుగున్నర వరకు స్కూల్ పిల్లలు ఉద్యోగస్తులు వాళ్లు పనులకు ఇబ్బంది లేకుండా ఆ టైంలో ఇసుక ట్రాక్టర్లని టిప్పర్లను నిషేధించాలని గతంలో ఆ విధంగా అధికారులు చేశారని డిఎస్పి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ విషయాలు పైన డిఎస్పి సానుకూలంగా స్పందిస్తూ కచ్చితంగా మా దృష్టికి వచ్చిన సమస్యల పైన అందరితో కలిసి మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరి డిఎస్పి సానుకూలంగా స్పందించినందుకు నగరి సిపిఐ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శ వేలన్ నాయకులు భాషా శేఖర్ నాగరాజు శిరావద్దీన్ సత్తార్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPI