WhatsApp Image 2024 06 11 at 19.45.21
CPI ML Prajapantha to Comrade Radakka Mass line
జిల్లా కమిటీ విప్లవ జోహార్లు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సిపిఐ(ఎంఎల్) ప్రతిఘటనోద్యమ నాయకురాలు భారత విప్లవోద్యమ నిర్మాత కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి గారి సహచరి
కామ్రేడ్ రాధక్క అలియాస్ నిర్మలక్కకు సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా విప్లవ జోహార్లు అర్పిస్తున్నది.
గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఆదివాసీ, గిరిజనులకు భూమి పంపిణీ చేసి, పోడు భూములు కొట్టించి, ప్రజల్ని చైతన్యపరిచి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు కామ్రేడ్ రాధక్క. సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితం గడిపింది. జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నది. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ప్రజా సమస్యల కోసం పోరాడింది,కామ్రేడ్ రాదక్క ఈరోజు ఉదయం మరణించింది.
కామ్రేడ్ రాధక్కకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తున్నాము.
(విప్లవాభినందనాలతో)
CPI ML మాస్ లైన్ ప్రజాపంధా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ
జూపాక శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి, తోకల రమేష్ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి, గుమ్మడి వెంకన్న అంతర్గాం మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు గూడూరి వైకుంఠం, ఆడెపు శంకర్, మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, పెండ్యాల రమేష్, కట్ట తేజేశ్వర్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
