WhatsApp Image 2024 11 07 at 15.16.57
సిపిఐ అల్లూరి జిల్లా సమితి సమావేశము.
ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి – జే.వి. సత్యనారాయణమూర్తి.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు లో శ్రీ.శ్రీ మోదకొండమ్మ తల్లి గుడి ఆవరణలో భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) జిల్లా సమితి సమావేశము. చింతపల్లి మండల కార్యదర్శి పేట్ల పోతురాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతి థిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి. సమావేశాన్ని ఉద్దేశించి అయన మాట్లాడుతూ, సిపిఐ అల్లూరి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు ప్రజా సమస్యలు ను దృష్టిలో పెట్టుకొని, ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలని ప్రజా సంఘాలతో కలిసి పని చేయాలని ఆయన తెలిపారు.
ప్రతి మండల శాఖలో శాఖ సమావేశాలు జరిపి శాఖలోనే పార్టీ సభ్యత్వములు పూర్తి చేయాలని, శాఖ సమావేశంలో కట్టలేని పక్షాన డిసెంబర్ ఇరవై ఆరు తేదీ లోపల ప్రతి శాఖ సభ్యతము జిల్లా పార్టీ నుండి రాష్ట్రపార్టీకి పంపించాలని. ఆయన తెలిపారు. ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి ఇల్లు మంజూరు చేయాలని మంజూరు చేసిన ఇల్లుకు ప్రభుత్వము ఐదు లక్షలు రూపాయలు మంజూర్ చేయాలని డిమాండ్ చేసారు.
నవంబర్ ఇరవై రెండు తారీఖున ప్రతి మండల కార్యాలయంలో ప్రజా సమస్యలతో ముట్టడి చేయాలిని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, మరియు అన్ని మండల కార్యదర్శిలు, ప్రజా సంఘ నాయకులు, మహిళా సమైక్య తదితరులు హాజరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
