TRINETHRAM NEWS

సిఎం పర్యటన సందర్బంగా కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం

అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలి: పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డిసెంబర్ 04 వ తేదిన పెద్దపల్లి లో ముఖ్యమంత్రి గా పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి డీసీపీ, ఏసీపీ లు, సీఐ లు ఎస్ఐ లతో బందోబస్త్ ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు, విఐపి లు వచ్చే మార్గాలు, ప్రవేశ మార్గాలు, సభకు వచ్చే ప్రజల రాకపోకల సౌకర్యం, ట్రాఫిక్ మార్గ దర్శకాల ఫై, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రత్యేక ప్రాంతాలు గుర్తింవు అనుగుణంగా ఏర్పాట్లు, వివిధ శాఖల సమన్వయం, అత్యవసర పరిస్థితిలలో అంబులెన్స్, ఫైర్ సర్వీస్ గురించి, బందోబస్త్ విధులకు సంబందించిన డ్యూటీ చార్ట్ స్పష్టంగా కేటాయింపు, స్పెషల్ టీమ్ ల ఏర్పాట్లు తదితర అంశాలఫై సమీక్షా సమావేశంలో అధికారులతో చర్చించి సలహాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి డిసిపి చేతన ఐపిఎస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App