
COVID-19 : త్రినేత్రం న్యూస్ : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్ బారినపడి మంగళవారం మృతి చెందారు. మృతుల్లో ఒకరికి 43 ఏళ్లు, మరొకరికి 60 ఏళ్లుపైనే ఉన్నాయని తెలిసింది.
మృతులిద్దరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో తదుపరి నిర్ధారణ పరీక్ష కోసం వారి బ్లడ్ శాంపిళ్లను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపడానికి కడప జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృత్యువాత పడగా.. 60 ఏళ్లు పైబడిన వ్యక్తి తమిళనాడులోని సీఎంసీ వెల్లూరులో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe