TRINETHRAM NEWS

Trinethram News : జోగులాంబ
గద్వాల ఫిబ్రవరి10:-ఆయా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయి కోర్టు లలో ట్రయల్స్ నడుస్తున్న కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యత తో పని చేస్తూ ఆయా కోర్టు ల పబ్లిక్ ప్రాసిక్యూటర్, అధనపు పబ్లిక్ ప్రాసక్యూటర్ లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశించారు. ఆయా కేసులలో శిక్షల శాతాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఈ రోజు జిల్లా ఎస్పీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు లైసనింగ్ అధికారులతో, కోర్టు డ్యూటీ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగ ఎస్పీ మాట్లాడుతూ ఆయా కేసులలో సాక్షులను ఇన్ టైం లో బ్రీఫింగ్ చేసి కోర్టు లో ప్రొడ్యూస్ చేయడం ద్వారా నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచాలని అందుకు ఆయా కోర్టు ల పబ్లిక్ ప్రాసిక్యూటర్, అధనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లతో సమన్వయం చేసుకుంటూ కోర్టు డ్యూటీ అధికారులు ముందుకెళ్లలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రాపర్టీ రిజిస్టర్ మెయింటైన్ చేయలని, ప్రాపర్టీ నీ సీజ్ చేసే క్రమం లో ఎస్ఓపి నీ అనుసరించాలని అన్నారు. సమ్మన్స్ మరియు వారెంట్ లు జారీ చేసినప్పుడు ఇన్ టైం లో రిపోర్ట్ ను మేజిస్ట్రేట్ కి పంపాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోర్టు డ్యూటీ అధికారులకు సూచించారు.న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చేలా భాద్యతగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు.

పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేసారు.ప్రస్తుతం కోర్టు డ్యూటీ అధికారులకు విధులలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్.రవి, ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్ట్ పిపి వినోద, అధనపు జిల్లా సెషన్స్ కోర్ట్ పిపి త్రిపాఠి, ప్రిన్సిపల్ అసిస్టంట్ సెషన్స్ కోర్టు అదనపు పీపి లక్ష్మణ స్వామి, అదనపు అసిస్టంట్ సెషన్స్ కోర్టు అదనపు పీపి యుగెందర్, కోర్టు లైసన్ అదికారులు ఎస్సై లు రమా దేవి, రషీద్, ఏ.ఎస్సై నర్సింహులు, కోర్టు డ్యూటీ అధికారులు,
డిసిఆర్బి ఎస్ఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.