కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 12 : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ లో వరద నీరు పొంగి రోడ్ల మీద ప్రవహిస్తూ కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉందన్న విషయం తెలుసుకున్నా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి ఇంజినీరింగ్ విభాగం మరియు జల మండలి అధికారులతో కలిసి సమస్యను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఊట నీరు పొంగి డ్రైనేజీ లైన్ గుండా రోడ్లపైకి ప్రవహించడంతో నీరుతో పాటు మట్టి కూడా రోడ్డుపైకి వచ్చి కాలనీ వాసులకు సమస్య ఏర్పడిందని అన్నారు.
వెంటనే వరద నీటి ప్రవాహం ఆగేలా చర్యలు తీసుకుని, రోడ్డుపై ఉన్న మట్టిని కూడా తొలగించి శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు. ఇప్పుడున్న డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండి, నివాసాలు పెరగడంతో నిత్యం నిండిపోయి సమస్య ఏర్పడుతుందని, తొందరలో పెద్ద లైన్ నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కరం చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఇ శ్రావణి, సమ్మారెడ్డి, మల్లేష్ గౌడ్, రమేష్, పోశెట్టిగౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


