Dodla Venkatesh Goud : వీధి కుక్కల దత్తత కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 12 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పటేల్ కుంట పార్క్ లో జి.ఎచ్.ఎం.సి వెటర్నరీ డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా హాజరై వారి చేతులమీదుగా కుక్క పిల్లలను దత్తత తీసుకునేవారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జి.ఎచ్.ఎం.సి వెటర్నరీ శాఖ వారు నిర్వహించిన వీధి కుక్కల దత్తత కార్యక్రమం అభినందించదగ్గ విషయం అని అన్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం వలన అవి ఎంతో విశ్వాసంగా ఉండి దొంగలను మరియు అపరిచితులను ఇంటిలోకి రానియ్యకుండా అవి కాపాలా ఉంటాయని అన్నారు.

రెండు పూటలా అన్నం పెడితే చాలు మీ ఇంటి నేస్తాలై మీ కుటుంబాన్ని సంరక్షిస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు పప్పీస్ ను పార్కులో మార్నింగ్ వాకింగ్ వచ్చేవాళ్ళు దత్తత తీసుకున్నారు. అయితే దత్తత ఇచ్చిన కుక్క పిల్లలను కూడా నెలకి ఒక్కసారైనా వాటి సంరక్షణ ఎలా ఉందో చూడాలని వెటర్నరీ వారికి సూచించారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, గాజులరామరం సర్కిల్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగార్జున, డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ దీపక్, మురళి, గణేష్, శ్రీకాంత్, సాయి, శీను తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Dodla Venkatesh Goud

You cannot copy content of this page

Scroll to Top