రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత – ఎర్ర యాకన్న
కూకట్పల్లి, నవంబర్ 26 (త్రినేత్రం న్యూస్) :- భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్‌లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎర్ర యాకన్న అధ్యక్షత వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారత మహా రత్నుడు, భారత ప్రజాస్వామ్యానికి శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎర్ర యాకన్న మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం మనందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయం అనే ప్రాథమిక హక్కులను ప్రసాదించిన గొప్ప పత్రం. భారత గణతంత్రాన్ని ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్యంగా నిలబెట్టడానికి రాజ్యాంగం బలమైన పునాది” అని పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే యువత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని, సమాజంలో ఉన్న వివక్ష, అసమానతలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులవ్వాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని, నిజాయితీతో ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం పత్రిక ధర్మమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి నగేష్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి రంజిత్ ముదిరాజు, జాయింట్ సెక్రెటరీ అంజిబాబు, సుజాత, సభ్యులు బబ్బికాంత్, అనిల్ కిషోర్, శివ కుమార్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


