జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 15 at 15.57.08

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్థంతరంగా నిలిపివేశారు..

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని నిలదీశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు పేర్కొనగా.. ఆర్డర్‌ కాపీని చూపించాలని పట్టుబట్టారు..

మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో మరియు మంగళగిరిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. ఉండవల్లి రామకృష్ణ థియేటర్‌ మరియు మంగళగిరి ఊర్వశి థియేటర్ వద్ద తెదేపా నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది..

You cannot copy content of this page