వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ప్రజా పాలనలో అభివృద్ధి వైపు గ్రామాలు.. పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్,రాఘవపూర్,జాఫర్ పల్లి గ్రామలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది.అనంతరం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాపూర్ రూ.10 లక్షలతో నిర్మించిన CC రోడ్లను.. రాఘవపూర్ గ్రామంలో రూ.18లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను. జాఫర్ పల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా TRR మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో CC రోడ్లను 20 లక్షల నుండి 50 లక్షల వరకు ఇప్పటికే వేయడం జరిగింది అని తెలిపారు.ప్రతి గ్రామంలో హైమస్ట్ లైట్లను ఏర్పాటు చేశాం అని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల ఆరోగ్య శ్రీ, మహిళలకు ఉచిత బస్సు,500 కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం,200 యూనిట్ల ఉచిత కరెంటు,రైతు భరోసా,భూమి లేని వారికి రాజీవ్ ఆత్మీయ భరోసా,రైతు రుణమాఫీ చేశామని మరియు రేషన్ కార్డులు 5143 మందికి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది.
3500 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే ప్రతి నియోజకవర్గం లో నిర్మాణ దశల్లో న్నాయని రాబోయే నెల రెండు నెలలో మరో 3500 ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అదే కాకుండా ప్రధాన రహదారులు పరిగి నుండి షాద్‌నగర్‌కి ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం మరియు పరిగి నుండి వికారాబాద్ ఫోర్ లైన్ రోడ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
పరిగి పట్టణంలోని కొత్త కుంట చెరువును మొదటి విడతలో రూ.21 లక్షలతో కొత్తకుంట అభివృద్ది పనులు చేపట్టాం.ప్రస్తుతం కట్ట వెడల్పు పనులు జరుగుతున్నాయి.కుంటను మినీ బ్యాంక్ బండ్ తరహాలో ఆధునీకరిస్తాం అని రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం కుంట ఎఫ్టీఎల్ పరిధిలో 29 ఎకరాలకు పెన్సింగ్ వేయిస్తాం.పట్టణ ప్రజలు సేదతీరేలా లైటింగ్ గ్రీవరీని ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.
ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో తెల్ల దొరల నుంచి టైంశాలతో స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ మనందరికీ స్ఫూర్తి అని కొనియాడారు.స్వాతంత్ర దేశానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని వివరించారు.రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణకు గాంధీజీ స్మరించుకుంటూ జై బాబు రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా జై భీమ్, జై సoవిదాన్ చేపట్టినట్లు వివరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


