
మెండె శ్రీనివాస్ ఆర్జీవన్ కార్యదర్శి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భారతదేశంలో శ్రమ దోపిడీ సామాజిక అణిచివేత కుల వివక్షల అంతంకై పోరాడుతున్న కెవిపిఎస్, గిరిజన సంఘం, సామాజిక ఉద్యమకారులకు అండగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటి నాయకులకు, సామాజిక సంఘీభావ ఉద్యమ నిధి అందించిన ఉద్యోగ సోదరి సోదరులకు మరియు అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాం, మెండె శ్రీనివాస్ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి,
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025 ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో సేకరించిన సామాజిక సంఘీభావ ఉద్యమ నిధి వివరాలు తెలియజేస్తున్నాం, జీడీకే 1&3 ఇంక్లైన్ లో 2837/- జీడికే 2 ఇంక్లైన్ లో 4901/- జీడికే 2A ఇంక్లైన్ లో 1670/- OCP-5 లో 4382/- S&PC లో 2030/- ఏరియా వర్క్ షాప్ 4280/- జీడికే 11 ఇంక్లైన్ లో 1680/- మొత్తం రూపాయలు 21780/- అందించడం జరిగిందని మరొక్కసారి ఉద్యోగస్తులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నను సేకరించిన నిధి మొత్తాన్ని సీఐటీయూ జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి అందజేస్తామని కార్మికులకు తెలియజేస్తున్నాం, సామాజిక ఉద్యమ నిధి లెక్కింపు కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్షులు ఆరెపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, ఎస్కే గౌస్, పిట్ కార్యదర్శులు దాసరి సురేష్, అన్నబోయిన శంకరన్న, వంగల శివరాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
