Computers don’t Work : పనిచేయని కంప్యూటర్లు

TRINETHRAM NEWS

తేదీ : 11/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం నగర పరిధిలోని యాభై సచివాలయాల్లో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిబ్బంది వారికి వచ్చిన జీతం లోనే సొంత కంప్యూటర్ ఏర్పాటు చేసుకుని సచివాలయాన్ని కొనసాగించడం అత్యంత బాధాకరమని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకి శెట్టి. బాలాజీ అన్నారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అన్ని సచివాల యాల్లో కంప్యూటర్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకొని, నూతన కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని, బాలాజీ డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు , విద్యుత్ బిల్లులు , కొత్త ప్రాపర్టీ పన్ను దరఖాస్తులు, ఓటర్ కార్డులకు దరఖాస్తులు కొరకు సేవలందించవలసిన కంప్యూటర్లు పనిచేయకపోవడం వలన ప్రజలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మీసేవ కేంద్రానికి వెళితే దరఖాస్తుకు వంద రూపాయలు వసూలు చేయడం వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది.

అదేవిధంగా దినసరి కార్యక్రమాలకు కావలసిన వైట్ పేపర్లు, ఇతర స్టేషనరీ కూడా అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు పెట్టాలన్న సచివాలయం నుండి కంప్యూటర్లు పనిచేయడం లేదు. మళ్లీ రండి అనే సమాధానం వస్తుంది. దీనివలన ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అధికారులు దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చేయాలని లంకిశెట్టి. కోరారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Computers that don't work

You cannot copy content of this page

Scroll to Top