
Compensation : గుంటూరు జిల్లా : మార్చి 26 : (త్రినేత్రం న్యూస్) ; మార్కాపురం జిల్లా, రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వాళ్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వాళ్లకు రూపాయలు రెండు లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఈ దుర్ఘటన పట్ల రాష్ట్ర మంత్రి మండలి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

