ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Collector Reviews Arrangements

Collector Reviews Arrangements : అల్లూరి జిల్లా, ఆగస్టు 5, (త్రినేత్రం న్యూస్): ఈ నెల 22న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో భాగముగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ‘సంజీవని’ పైలట్ ప్రాజెక్టు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, మరియు ముఖ్యమంత్రి పర్యటనకి అంతకుముందు జరగవలసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ టి. నిషాంతి మంగళవారం కలెక్టర్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు.
సంజీవని కార్యక్రమానికి అవసరమైన ఆరోగ్య సేవలు, డిజిటల్ నమోదు, వైద్య శిబిరాలు, తాగునీరు, భద్రత, ముఖ్యమంత్రి పర్యటనకి హెలిప్యాడ్, సభా ప్రాంగణం తదితర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page