తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..నాలుగైదు రోజుల్లో మేఘ సందేశం

TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా చల్లని కబురు ఇది. మరో నాలుగైదు రోజుల్లో వానలే వానలు. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.

గత ఏడాదిలా కాకుండా ఈసారి తెలుగు రాష్ట్రాలను గట్టిగా పలకరిస్తామంటున్నాయి నైరుతి రుతుపవనాలు. ఈనెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతు పవనాలు తాకుతాయి.

ఆ తర్వాత కేరళను పలకరించి.. తెలుగు రాష్ట్రాలకు చల్లని మబ్బులు దూసుకొస్తాయి. ఈసారి వర్షపాతం బాగా నమోదవుతుందని చెబుతోంది వాతావరణ శాఖ. ఎల్‌ నినో ప్రభావం తగ్గి, లా నినో ప్రభావం రాబోతుండడం దీనికి దోహదం చేస్తుందంటున్నారు అధికారులు.

ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉంటుందంటున్నారు నిపుణులు.

ఈ ఏడాది ప్రస్తుతానికి అనుకూల పరిస్థితులే ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తొలకరి పలకరింపు కోసం తెలుగు రాష్ట్రాలు తెగ ఎదురు చూస్తున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top