
Trinethram News : Telangana : శ్రీశైలం SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.
ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్య నారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు.
వారం రోజుల క్రితం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే.
వారిని రక్షించేందుకు రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
