
Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సంబంధిత దస్త్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు.
రాష్ట్రంలో 3,874 మంది జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు.
