Mon. Mar 9th, 2026

CM meets Union Minister : కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : Feb 12, 2026, తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.

ఈసా-మూసీ నదుల సంగమ స్థలంలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు, 1948లో మహాత్ముని చితాభస్మాన్ని ఇక్కడే నిమజ్జనం చేశారని వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి చిహ్నంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth Reddy meets Union Minister Rajnath

Related Post

You cannot copy content of this page