జూలై 23, 2026

WhatsApp Image 2023 12 25 at 2.14.34 PM

TRINETHRAM NEWS

సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

హైదరాబాద్:డిసెంబర్ 25
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడు తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీ ఆర్ టెస్టు కూడా చేయను న్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జేఎన్-1 అనే న్యూ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సడన్‌గా అనారోగ్యం బారినపడటం ప్రజలను, కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం రావడంతో కొవిడ్ టెస్టులు చేస్తున్నట్లు సమాచారం.

ఒక వేళ సీఎంకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇటీవల ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా టెస్టులు చేయించుకోనున్నారు.

You cannot copy content of this page