జూలై 7, 2026

WhatsApp Image 2024 03 31 at 1.56.22 PM

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు.

ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో ఆయన సమావేశమై మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో తొమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తాము తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ మద్య నియంత్రణ పాలసీని తీసుకొస్తామని, వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సీఎం జగన్ రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్‌తో పాటు భాస్కర్ అవార్డులు వస్తాయని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నెపాన్ని కుటుంబ సభ్యులపై వేసిన మహానటుడని లోకేశ్‌ విమర్శించారు. కేంద్ర హోంశాఖ లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన నేపథ్యంలో ఈ సమావేశానికి సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) సిబ్బంది ఆయన వెంట వచ్చారు..

You cannot copy content of this page