WhatsApp Image 2024 05 11 at 10.49.43
ఏపీ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. చివరి రోజు సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పిఠాపురంలో ఫినిషించ్ టచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురంలో ఎండ్‌ఆఫ్‌ద స్పీచ్పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. సాయంత్రం 6గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ప్రచారానికి ఇక కొన్ని గంటల మాత్రమే ఉండడంతో లాస్ట్‌డే సుడిగాలి ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్.
వైనాట్ 175 అనే నినాదంతో వైసీపీ తరపున సీఎం జగన్ ఒక్కరే పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడా ప్రత్యర్థులపై అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించకుండా.. తాను చేసిన సంక్షేమం, అభివృద్దిని వివరిస్తూ ముందుకు సాగారు. గత 59 నెలల కాలంలో జరిగిన మంచిని పరిగణలోకి తీసుకుని తన పాలన ద్వారా లబ్ధి చేకూరింటేనే తనకు మరోసారి ఆశీర్వదించమని అభ్యర్థించారు. ఇలా తనదైన మార్క్ ప్రచారంతో దూసుకెళ్లిన సీఎం జగన్ ఇవాళ్టి మూడు సభలతో ప్రచారాన్ని గ్రాండ్‌గా ఎండ్ చేస్తారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
