
CM Chandrababu : అల్లూరి జిల్లా అరకు లోయ ఆగస్టు 30, (త్రినేత్రం న్యూస్): మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ‘సంజీవని’ ప్రాజెక్టును అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం గన్నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి మాట్లాడుతూ సంజీవని ద్వారా గిరిజనులకు సాంకేతిక ఆధారిత వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొండ ప్రాంత ప్రజలు వైద్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని అన్నారు. డ్రోన్ల ద్వారా రక్త నమూనాలను పెద్ద ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించడం, 104 సంచార వైద్య వాహనాలు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టామన్నారు. సంజీవని రాష్ట్రంలో, దేశంలో గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు.
ఆర్‌కె. నగర్‌లో ప్రజలతో సీఎం ముఖాముఖి
గన్నెల పంచాయతీ ఆర్‌కె. నగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ పథకాలు, వైద్య సేవలు, పిల్లల విద్య, గ్రామాభివృద్ధిపై ఆరా తీశారు. గర్భిణీలతో ప్రత్యేకంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని మహిళలకు సూచించారు. గ్రామానికి చేరుకున్న సీఎంకు మహిళలు, చిన్నారులు థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నెల పీహెచ్‌సీ వద్ద అంబులెన్సులను ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు వేగంగా అందేలా ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe