TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై టీటీడీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు.

బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమాయాలతో పాటు.. సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి అభిప్రాయాలపైనా చర్చకు వచ్చింది. ఈ సమావేశానికి దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ అధికారులు హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu reviews TTD