జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 17 at 11.04.15 AM

TRINETHRAM NEWS

CM Chandrababu Naidu met Prime Minister Narendra Modi today

Trinethram News : న్యూ ఢిల్లీ : ఆగస్టు 17
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.

రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతా రామన్ సహా పలువురు కేంద్రమంత్రులు, పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు.

ఈరోజు సాయంత్రం 4 గంట లకు ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్‌తో భేటీ అవుతారు.

రాత్రి 7గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించ నున్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశ మయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు.

సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర జలవ నరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలు వురు ఎంపీలు సమావే శంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu Naidu met Prime Minister Narendra Modi today

You cannot copy content of this page