TRINETHRAM NEWS

City people should be alert for rains: Vikarabad Municipal Chairperson Manjula Ramesh Garu Chigullapally

Trinethram News : నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల వికారాబాద్ పట్టణ ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది అందరు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

శిథిలావస్థలో ఉన్న గృహాలు ఉంటే అలాంటి వాటిని గుర్తించి వెంటనే అందులో నుంచి కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, మురుగు కాలువలు అన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఎక్కడ కాలువలు నిండిపోయి ఓవర్ ప్లో కాకుండా చర్యలు చేపట్టాలి అన్నారు. కాలనీలలో రోడ్డు పక్కన ఎక్కడ కూడా నీటి నిలువ లేకుండా చూసుకోవాలని, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది కాబట్టి పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది అన్నారు.

అలాగే మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుందని చైర్ పర్సన్ వెల్లడించారు. ప్రజలు ముఖ్యంగా చిన్నారులు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకి వెళ్లకూడదని, ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్ : 9398227053 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

City people should be alert for rains: Vikarabad Municipal Chairperson Manjula Ramesh Garu Chigullapally