జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 21.11.44

TRINETHRAM NEWS

ఉద్యోగ భద్రత కల్పిస్తూ అరకు ఏరియా ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని సిఐటియు డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి 28

అరుకు ఏరియా ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల నుండి పారిశుద్ధ కార్మికులుగా అనేక సేవలు అందిస్తున్న వారికి ఇచ్చే వేతనం సరిపోడులేదని చట్ట ప్రకారం కనీస వేతనం 26,000 చెల్లించాలని హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం హాస్పిటల్ సుపర్ డెంట్ వారికి డిమాండ్ తో కూడిన వినతి పత్రం అందించారు. తక్షణం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని డిమాండ్ చేశారు 2019లో అప్పటి వైసిపి ప్రభుత్వం 16,000 వేతనం జీవో విడుదల చేశారని నేటికీ అది అమలు కావడం లేదని అన్నారు ప్రస్తుతం 11,200 జీతం ఇస్తున్నారని తెలిపారు.

కార్మికులకు కొత్తగా జాయిన్ అయిన వారికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ప్రతి నెల జీతం చెల్లించాలని తెలిపారు, రెస్ట్ రూమ్ లో ఏర్పాటు చేయాలని జీతాల్లో కోతలు విధించరాదని తెలిపారు, కార్మికులకు గుర్తింపు కార్డు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ,సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు, ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ సెక్రటరీ రఘు, కాసులమ్మ, రామచంద్ర, రామారావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page