CITU : అరుకు కేకే లైన్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలంటూ సిఐటియు డిమాండ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ ఆగస్టు 22, (త్రినేత్రం న్యూస్) : అరుకు కేకే రైల్వే లైన్‌లో పనిచేస్తున్న ట్రాక్ మెయింటెనెన్స్, శానిటేషన్ తదితర విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం భవనంలో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ కార్మికుల కష్టానికి తగ్గ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని విమర్శించారు. జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని, పాత కార్మికులను తొలగించడం చట్ట విరుద్ధమని అన్నారు.
సేఫ్టీ మెటీరియల్స్ సరఫరా చేయడం, సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించడం వంటి డిమాండ్లు చేశారు. కనీస వేతనాలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చిట్టిబాబు,దిలీప్, సమర్ధి రాజు, కుర్రా అర్జును, అశోక్ కుమార్, అరుణ్ కుమార్, రవీంద్ర, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CITU demands minimum wages for contract workers

You cannot copy content of this page

Scroll to Top