అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Chittam Murali

ఎన్నికల అధికారికి బి-ఫారం అందజేత

Chittam Murali : అనంతగిరి అక్టోబర్ 28,(త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అనంతగిరి మండల ఎంపీటీసీ ఎన్నికల్లో అనంతగిరి సెగ్మెంట్ కూటమి అభ్యర్థిగా చిట్టం మురళి ఎన్నికల అధికారి (ఆర్వో) కి బి-ఫారం అందజేశారు. టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.
ఎగువ శోభ, అనంతగిరి పంచాయతీల సమగ్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని మురళి తెలిపారు. తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, రెండు పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page