LoC : ముఖ్యమంత్రి సహాయనిధి(ఎల్ ఓ సి) అందజేత

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 21 : కూకట్పల్లి నియోజక వర్గం  వివేక్ నగర్ డివిజన్ నివాసం ఉంటున్న వనరస.యాదగిరి  ఎస్/ఆఫ్ వి.సీతారాములు వయస్సు 50 సంవత్సరాలు, మొకాళ్ళ నొప్పితో పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వైద్యులు మోకాలికి బైపాస్ సర్జరీ చేయవలసిందిగా సూచించారు.వారి మనవరాలు కూకట్పల్లి లోని గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కార్యాలయంలో సంప్రదించగా కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి అప్లై చేయించగా, వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా( ఎల్ ఓ సి ) రూ .150000/ (లక్ష యాభై వేల రూపాయలు) మంజూరు అయినవి.

ఆ ఎల్ ఓ సి లెటర్ ను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ  ఇన్చార్జి బండి రమేష్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వేంకటేశ్వర రావు చేతుల మీదగా యాదగిరి మనవరాలు రీతు గారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి మరియు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కి  కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

LoC

You cannot copy content of this page

Scroll to Top