M.D. Ilyas Patel : మైనార్టీ సమస్యలపై ఊసెత్తని ముఖ్యమంత్రి

TRINETHRAM NEWS

యం డి.ఇలియాస్ పటేల్. బీ ఆర్ ఎస్ దేవరకొండ నగర ఉపాధ్యక్షులు.

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 10 త్రినేత్రం న్యూస్. ప్రజా పాలన విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండలో నిర్వహించిన సభకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం మైనారిటీ సమస్యల పట్ల ఏమాత్రం స్పందించకపోవడం విచారకరమని బి ఆర్ ఎస్ దేవరకొండ నగర ఉపాధ్యక్షులు యండి ఇలియాస్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా రాష్ట్రంలో ఏ ఒక్క ముస్లిం మైనార్టీ సమస్య పరిష్కారం కాలేదు అన్నారు. ముఖ్యంగా మస్జిద్ ఇమామ్, మవుజముల వేతనాలు పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు .ప్రస్తుతం ఇచ్చే వేతనాలు కూడా నెలనెలా ఇవ్వకపోవడం ద్వారా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా పెళ్లిళ్లు చేసుకొని ఏడాది పూర్తవుతున్న షాదీ ముబారక్ నిధులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు మైనార్టీ గురుకుల పాఠశాలలో బ్రష్టు పడి పోతున్నాయని వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని అన్నారు.
అలాగే నగరంలో షాది ఖానా ఉర్దూ మీడియం పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని ఇప్పటివరకు ఓ మైనార్టీ కమ్యూనిటీ హాల్ ఉర్దూ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు మైనార్టీ యువతకు రుణాలు కల్పించి స్వయం ఉపాధి అవకాశాలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం దానిని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి వస్తే తమ బాధలు చెప్పుకోవాలని చూసిన ప్రజలకు నిరాశే ఎదురైందని తమ సమస్యల పరిష్కారం అవుతాయని భావించి వేచి చూసిన ప్రజలకు నిస్సృహ మిగిలిందని పేర్కొన్నారు. కేవలం కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీని విమర్శించేందుకే సీఎం టూర్ పెట్టుకున్నారని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister who is not bothered about minority issues

You cannot copy content of this page

Scroll to Top