TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లా:

పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్…

ఉద్దానం అంటే దాని అర్థం ఉద్యానవనం

ఈ పచ్చని ప్రాంతంలో ప్రజలపై ఏదో మహమ్మారి కాటు వేసినట్టు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు వారి జీవితాల్లో అల్లకల్లోలం చేశాయి

ఇవన్నీ నా పాదయాత్రలో చూడటం జరిగింది

పాదయాత్రలో వాళ్ళ గుండె చెప్పుడు విన్నాను

పాదయాత్రలో నేను ఉన్నాను నేను చూశాను అని వాళ్ళకి చెప్పాను

2018 డిసెంబర్ 30న ఇదే పలాసలో మాట ఇవ్వడం జరిగింది

మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడే 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెస్తామని చెప్పడం జరిగింది

దేవుడి దయవల్ల ఈ రెండు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ముందు ఉన్నాడని చెప్పటానికి గర్వపడుతున్నా

ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మాణం చేసాం

2018 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేయడం జరిగింది

ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కనీసం ఊహలలో కూడా ఏదైనా చేయటానికి సాహసించలేదు

మీ బిడ్డ కాబట్టి ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ ధ్యాస పెట్టాడు

సురక్షిత మంచినీరు తీసుకువచ్చేందుకు ఏకంగా 700 కోట్ల రూపాయలతో హిరమoడలo రిజర్వాయర్ నుండి పైప్ లైన్ల ద్వారా నీటిని అందిస్తున్నాం

దీని వల్ల ఉద్దానం ప్రాంతం లో 7 మండలాల్లో 807 గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా అవుతుంది.

వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించే జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఈ హాస్పిటల్ పని చేయబోతుంది

డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలలో ICU బెడ్స్ ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి

ఈ ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్పటేషన్ చేసే ఆపరేషన్ కూడా ఈ హాస్పటల్లో జరగబోతుంది

రేడియాలజి,నెఫ్రాలజీ, డయాలసిస్,యూరాలజీ విభాగాలతో పాటు రీసెర్చ్ ల్యాబ్లు ఉన్నాయి

అత్యాధునిక సిటీ స్కాన్, డిజిటల్ ఎక్సరే, డైనమిక్ మిషన్ అత్యాధునిక పరికరాలు ఇక్కడ ఉన్నాయి.