ఆడబిడ్డ పెళ్ళికి 10500/- వేల రూపాయల కిరాణా సరుకులు అందించిన అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సామాజిక సేవకులు
Trinethram News : లింగాపూర్ : పేదింటి ఆడబిడ్డలకు అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యులు పెద్దన్నగా అండగా ఉంటారని గౌరవ సభ్యులు జాటోత్ దవిత్ కుమార్ అన్నారు. కొమురం భీం జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద రైతు ఆడే పంచఫులా బాయి సీతారాం దంపతుల కుటుంబ ఆర్థిక పరిస్థితిని అభ్యుదయ ఫౌండేషన్ ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ గౌరవ సభ్యులైన జాధవ్ సుశీల్, జాధవ్ మారుతీ కీ వివరించి, పేదింటి ఆడబిడ్డ ద్వితీయ కుమార్తె ఆడే భూల్లిబాయి వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు జాధవ్ దవిత్ కుమార్ (టీచర్), డాక్టర్ ఆడే క్రాంతి కుమార్, డాక్టర్ రాథోడ్ రాజ శేఖర్, జాధవ్ చంద్రకళ (జూనియర్ అసిస్టెంట్), జాధవ్ రమేష్ (పోలిస్), జాధవ్ కైలాష్ (స్త్రినిధి), జాధవ్ అశోక్ (వన్ నేషన్ వన్ ఎలక్షన్ లింగాపూర్ మండల కన్వీనర్), పఠాన్ షారుఖ్ షబ్బీర్ ఖాన్, చవాన్ శివా, ఆడే ప్రవీణ్ కుమార్ (ఎన్.ఆర్.ఐ – దుబాయ్), బాణోత్ రామ్ ప్రసాద్ (మీసేవా లింగాపూర్), జాధవ్ శ్రీనివాస్ (హ్యూమన్ రైట్స్ చైర్మన్ లింగాపూర్ మండలం), రాథోడ్ రవీందర్ (తహసీల్దార్ కార్యాలయం తృతీయ శ్రేణి సహాయ అధికారి లింగాపూర్), రాథోడ్ మహేష్ (బౌన్సర్) ద్వారా తమవంతుగా రూ.10500/- వేల రూపాయలు విలువైన నిత్యావసర సరుకులను అమ్మాయి తల్లిదండ్రులు ఆడే పంచఫులా బాయి సీతారాం కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు.
పేద కుటుంబానికి అండగా నిలిచిన అభ్యుదయ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులకు ఆడబిడ్డ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ మాట్లాడుతూ … పేదింటి ఆడబిడ్డలకు లింగాపూర్ అభ్యుదయ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పెద్దన్నగా వ్యవహరిస్తూనే, తనవంతుగా హెల్పింగ్ హాండ్స్ గౌరవ సభ్యులు సహకారంతో ప్రతి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సామాజిక సేవలో భాగంగా అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవార్ ఘమా బాయి, జాధవ్ కౌసల్యా బాయి, చవాన్ విశాల్, రాథోడ్ సచిన్, రాథోడ్ శ్రీకాంత్, జాధవ్ శ్రీనివాస్, జాధవ్ మారుతీ, జాధవ్ అజేష్, జాధవ్ కైలాష్, రాథోడ్ భారత్, చవాన్ కృష్ణ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


