తేదీ : 18/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు ధైర్యంగా తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విజయవాడ యంపి కేసినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. బీసెంట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ యస్ బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యం పి మరియు ఎమ్మెల్యే బోండా. ఉమామహేశ్వరరావు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో షాప్ చైర్మన్ రవి నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల. సీతారామయ్య యువ నాయకులు బోండా. సిద్ధార్థ కూడా పాల్గొన్నారు. ముందుగా యం పి, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ఆర్ యస్ బ్రదర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా యం పి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. వారి టాక్స్ కట్టడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించడం సంతోషం అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇలాంటి పెద్ద షోరూం లు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
భవిష్యత్తులో ఇలాంటివి మరెన్నో రావాలని ఆకాంక్షించారు. వీటి ద్వారా ఎంతోమందికి జీవనోపాధి లభించి ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


