TRINETHRAM NEWS

సకల సుగుణాల కలబోత- జన హృదయ నేత- ఛత్రపతి శివాజీ మహారాజ్

ఉద్యమం సాహసం ధైర్యం బుద్ది శక్తి పరాక్రమా
షడైతే యత్ర వర్తంతే తత్ర దేవేతరో జనా
అంటే… ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ది, శక్తి, పరాక్రమాలనెడి ఆరు గుణాలు ఎవరికుంటాయో అటువంటి వారికి దేవుడు కూడా సహకరిస్తాడని ఈ సుభాషితం యొక్క అర్థం.
ఈ సుభాషితం లో గల ఆరు సుగుణాలు కలబోసి వీరుడిగా ఎదిగి ఛత్రపతిగా హిందూ హృదయ సామ్రాట్ గా నిలిచాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్.
శివాజీలో గల ఈ ఆరు గుణాలను ఒకసారి విశ్లేషించుకుంటే…

ఉద్యమం
తను రాజు గాకున్నా తన 14ఏళ్ళ వయసునుండే స్వరాజ్య సాధన కోసం కొండ కోనల్లో నివసించే మావళీలు అనే గిరిజనులను దేశ భక్తులుగా మలచి మొఘలులపై పోరాటానికి ముందు నడిపిన మహా ఉద్యమకారుడు మన శివాజీ.

సాహసం
ఆగ్రా కోటలోకి దౌత్యం పేర పిలిచి కుయుక్తి తోడ తనను బంధించిన ఔరంగజేబు ను బోల్తా కొట్టించి దుర్భేద్యమైన కోటనుండి తప్పించుకుని ఆగ్రా నుండి విస్తార మొఘలు సామ్రాజ్య అధినేతల తప్పించుకుని పూణె వరకు చేరుకోవడంలో శివాజీ యొక్క సాహసం మనకు కనబడుతున్నది.

ధైర్యం
పూణె కోటను యశ్వంత్ అనే ఉడుము సహాయంతో 125 అడుగుల ఎత్తున్న కోటను ఎక్కి అసమాన ధైర్యంతో శయిస్తాఖాన్ ను ఎదుర్కొని వాడు గోడ దూకి పారిపోతుంటే వాని వేళ్ళు నరకడం శివాజీ ధైర్యానికి నిదర్శనం.

బుద్ది
బాహుబలంతో పాటు బుద్దిబలం కూడా తోడైతే అత్యంత బలవంతున్ని సైతం మట్టికరిపించ వచ్చని శివాజీ నిరూపించిన ఉదంతం మనకు అఫ్జల్ఖాన్ వధ ఉదంతం తెలియజేస్తూంది. అఫ్జల్ఖాన్ తన రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చి ఎన్నెన్నో రాక్షస కృత్యాలు చేస్తున్నా తనకు అనుకూలమైన చోటుకు అఫ్జల్ వచ్చేదాకా వేచి చూసి, భయపడ్డట్లు నటించి, వానిని పొగిడి, బీజాపూర్ నుండి 1200కిలోమీటర్ల దూరం 28రోజులు ప్రయాణింప జేసి ప్రతాప్ ఘడ దాకా రప్పించి వాని ఎదుటకు నిరాయుధునిగా వెళ్లినట్లు నటించి యుక్తితో అఫ్జల్ఖాన్ ను వధించిన కుశాగ్రబుద్ది శివాజీది.

శక్తి
యశాజీ కంక్, తానాజీ మాల్సురే,నేతాజీ పాల్కర్, సూర్యాజీ మాల్సురే,కొండాజీ కంక్,బాజీభీడె వంటి ఎందరెందరో మావళీలను శక్తివంతమైన ప్రమధగణాలుగా మలచిన ధీశాలి మన శివాజీ.

పరాక్రమం
అవసరమైతే మూడడుగులు వెనక్కివేసి శతృవును గురిచూసి వేటాడిన పరాక్రమశాలి శివాజీ.
ఇలా ఈ ఆరుగుణాలు పుణికిపుచ్చుకుని భవానీ మాత ఇచ్చిన ఖడ్గంతో వీరవిహారం చేసి హైందవ సామ్రాజ్య స్థాపన చేసిన మహావీరుడు మన శివాజీ.
ఇవే కాకుండా ఇతర సుగుణాలను కూడా శివాజీలో మనం చూడవచ్చు.

జట్టుభావన
ఒక పని సఫలం కావాలంటే తానొక్కడే కాక అందరినీ కల్పుకపోతే జట్టుభావన తొ విజయం సాధించవచ్చని శివాజీ నిరూపించాడు. అందరిలో స్వరాజ్య భావన జాగృతము చేసాడు. కొండ ప్రాంతాలలోని మావళీలను, కొంకణ తీరంలోని కోలీలను, మైదాన ప్రాంతాల్లోని భండారీలను,సామాన్యులను,సంపన్నులను,అధికార వర్గాల వారిని చేరదీసాడు.ఆధ్యాత్మిక గురువులు రామదాసు, తుకారాం వంటివారి ఆశీస్సులు అందుకున్నాడు.తనను వ్యతిరేకించే సర్దార్లను ఓపికగా తనవైపు తిప్పుకున్నాడు.స్వరాజ్యభావన అందరిలో జాగృతం చేసి భవ్య హైందవ రాజ్య నిర్మాణం గావించాడు.
ప్రచండ దేశభక్తి
చిన్నప్పటినుండి తల్లి ఉగ్గుపాలతో నూరిపోసిన దేశభక్తి కారణంగా తన తండ్రితో బీజాపూరు సుల్తాను కొలువుకు వెళ్ళినపుడు సుల్తానుకు వంగి సలాము చేయకపోవడం, ఎక్కడ కూడా మొఘలులకు లొంగకుండా వారిని జీవితాంతం ఎదిరించి బతకడం, బాల్యంలోనే కోటను ఆక్రమించి భగవాధ్వజం ఎగరేయడం,
ఇంకోసందర్భంలో … శివాజీ యొక్క స్వరాజ్య నాణాలను తమ టంకశాలలో ముద్రిస్తామని ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించి రాజ్యంలో నకిలీ నాణాల చలామణి గాకుండా అడ్డుకున్నాడు. ఇలా అణువణువునా శివాజీలో ప్రచండ దేశభక్తి ప్రతిధ్వనిస్తుంది.

ఆదర్శ పాలకుడు
శివాజీ కి తన తండ్రి నుండి మావళ ప్రాంతంలోని ని కేవలం 36 గ్రామాలు మాత్రమే వారసత్వంగా లభించాయి అదే తర్వాత ఒక భవ్య సామ్రాజ్యం గా విస్తరించింది తన పనుల ద్వారా వ్యవహార శైలి ద్వారా అధికారం వ్యవస్థలను ఎలా నిర్వహించాలి అనేది చేసి చూపించాడు బంధుప్రీతి దూరం పెట్టాడు సుమారు మూడు వందల కోటలు తన దగ్గర ఉన్నా ఏ ఒక్క కోటకు కూడా తన బంధువులను అధిపతిగా చేయలేదు తన 30 సంవత్సరాల పాలన కాలం మొత్తం పాలనా వ్యవస్థను సృష్టించి వికసింప చేయడంలోనే గడిపారు ఆయన యుద్ధాలకు ముందు తరువాత సమయాన్ని పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో వెచ్చించారు అష్ట ప్రధానులు అనే పేర మంత్రులను నియమించి ఆర్థిక శాఖ ఆనాడే ఆర్థిక శాఖ హోం శాఖ వ్యవసాయ శాఖ న్యాయశాఖ విదేశీ వ్యవహారాల శాఖ శాస్త్ర సాంకేతిక శాఖ రోడ్లు సముద్రయాన శాఖ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భాషా సాంస్కృతిక శాఖ రక్షణ శాఖ ప్రజా సంబంధాల శాఖ అడవులు పర్యావరణ శాఖ అంటూ ఇలా వివిధ భాగాలుగా పాలనను వర్గీకరించి సుపరిపాలన అందించి ఆదర్శ పాలకునిగా నిలిచారు

ఆర్థిక వ్యవహారాలు క్రమశిక్షణ
శివాజీ ఆర్థిక వ్యవహారాల కు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఒక సందర్భంలో వివిధ మంత్రిత్వ శాఖ లా ఆర్థిక వ్యవహారాలను తెలుసుకున్నప్పుడు దేశ్ కులకర్ణి అనే ఆర్థిక అధికారిని ముందరి రోజు లావాదేవీలు లెక్కలు పూర్తయ్యాయా? అని ప్రశ్నించారు దానికి అధికారి లేదు అని సమాధానమిచ్చాడు అంతేకాదు అలా చేయలేక పోవడానికి గల కారణాలు కూడా ఆ అధికారి తెలియజేశాడు శివాజీ ఈ బాధ్యతారాహిత్యానికి కఠిన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మరోసారి తన సైన్యాన్ని తనిఖీ చేస్తుండగా ఒక అధికారి ఒక గుర్రం యుద్ధంలో గాయపడి కుంటిది అయిపోయింది అని కాబట్టి దాన్ని అమ్మేందుకు అనుమతి కావాలి అని కోరారు శివాజీ అనుమతిచ్చారు కొద్ది నెలల తర్వాత అధికారి వేరే పనిమీద శివాజీ ని కలిశారు ఆయన్ని చూడగానే శివాజీ ఆ గుర్రాన్ని అమ్మేశారా? అని అడిగారు ఆ అధికారి అమ్మినట్లు చెప్పగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఖాతాల్లో జమ చేశార అని మరో ప్రశ్న వేశారు ఇలా ఆర్థిక రంగంలో అతి చిన్న విషయాలను కూడా పర్యవేక్షించడం ఆయన ఆర్ధిక క్రమశిక్షణ నిజాయితీకి నిదర్శనం.

శివాజీ మహారాజ్ ఆదర్శ జీవితం

శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.
శివాజీ మెరపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకొన్న అప్జల్‌ఖాన్‌ శివాజీని అంత మొదించటానికి ప్రయత్నించినపుడు వ్యూహాత్మ కంగా తను దర్శించిన పులిగోర్లతో అప్జల్‌ఖాన్‌ పొట్ట చీల్చి సంహరించాడు. శివాజీ విజయాలతో మొఘల్‌ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ ‘పహిస్తాఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెనుతిరగవలసి వచ్చింది. 1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బందించినపుడు చాలా చాకచక్యంగా తప్పించుకొన్నాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసి వారిని కుశలురైన నాయకులుగా తీర్చిదిద్దటం ఎలాగో చత్రపతి శివాజీ చూపించాడు. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియజేస్తుంది.
హిందూ జీవన విధానంలో ఏ విషయాన్ని వివరించకుండా వదిలివేయలేదు, అది ఆహారం కావచ్చు విహారం కావచ్చు చివరికి యుద్ధం కావచ్చు. ప్రపంచంలో ఏ జాతికి యుద్ధ నియమాలు లేవు! మూకుమ్మడిగా దాడి చేసి, శత్రువును లొంగదీసు కోవడమే వారికి తెలిసిన ‘నీతి’. కాని కేవలం హిందువులు మాత్రమే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చెయ్యాలి, వెన్ను చూపి పారిపోతున్న వ్యక్తిని చంపకూడదు, ముసలివారు, పిల్లలు, స్త్రీలను చంపకూడదు మొదలైన నియమాలను పాటించారు.
ఐతే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృధ్వీరాజ్‌ చౌహాన్‌ 16 సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలివేసాడు. కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచి నప్పుడు మాత్రం పృధ్వీరాజుని బంధించాడు. అనేక హింసలకు గురి చేసాడు. ప్రజల్ని హింసించాడు, దోచుకున్నాడు.
హిందూ జాతికి తురుష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం, ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్టపరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు.

ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికీ హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మతం ఏమి చెపుతోందో, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తరచి చూసుకోకుండా అన్ని మంచినే బోధిస్తాయి, అవి అన్నీ ఒకటే అన్న విపరీత ధోరణి వల్ల వాటినుంచి వస్తున్న దాడులను అర్థంచేసుకుని, ఎదుర్కొనడంలో హిందూ సమాజం విఫలమవుతోంది.
ఈ రకమైన వివేచనారహిత ఆలోచనా విధానం స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. ఐతే రామజన్మభూమి ఉద్యమం తరువాత హిందువులలోని ఈ ఆత్మహత్యాసదృశమైన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాము. కాని పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన రోజునే శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలం. దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం, శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే ‘స్వరాజ్యం’, ‘సురాజ్యం’ సాధ్యమవుతాయి.

దాని తర్వాత?? ఎం జరుగుతుందో నీకు తెలుస్తుందా???

నువ్వు మీ చుట్టుపక్కల చూస్తున్న ప్రశాంతత ఆకాశం,అది లేదు.
ఉన్నట్టు భ్రమ పడుతున్నావు..

నువ్వు చూడకుండా ఉన్న సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి..
అవి గాలి లాంటిది..
నువ్వు చూడలేవు..నీ చుట్టూ ఉన్న సరే…
మతం పేరుతొ నీదేశ సంస్కృతిని నాశనము చేస్తున్నాయి..

నేను గమనించా…
అందుకే అందరికి మనదేశ సంస్కృతి, పూర్వవైభవం గూర్చి చెప్తున్నా…

దేవుడు పేరుతొ, మతం మాయలో భారతీయ సంస్కృతి ని మర్చిన ఓ భారతీయుడా తెలుసుకో..
నీ జాతి వైభవాన్ని…

దైవం కంటే దేశం గొప్పది…
దేవుడి పేరుతొ నిన్ను నీ దేశం నుండి.. దేశం నుండి నిన్ను వేరు చేస్తున్నారు…

రత్నాలు రాసులుగా పోసిన ఈ నెల నీదే..

ప్రపంచపు మొదటి విశ్వవిద్యాలయం నీదే..

ప్రపంచపు మొదటి రిజర్వాయర్ నీదేె..
విశ్వ విజేత అనుకున్న అలెగ్జాండర్ ని మైమరిపించిన దేశం నీదే…

తెలుసుకో నీ జాతి గొప్పతనం… భారతీయుడా మేలుకో…….

చూడరా …చూడరా…ఓ హిందువా
ముక్కల చెక్కలైన నిలువెత్తు అఖండ హిందూ భారతం ….. ..

కుల కొట్లాటల్లో మగ్గి మగ్గి
మత మార్పిడీల్లో సర్వం కోల్పోతున్న తల్లి భారతి కన్నీళ్లు చూడు …. ఓ హిందూ సోదరా…..

నాడు కాశ్మీరున రోధిస్తున్న తెగిన తలలు నీ సోదరులవే
కేరళలో చినిగిన దుస్తులతో రోధిస్తున్న ఆ స్త్రీ మూర్తులు — నీ అక్క చెల్లెల్లె…..

బెంగాలును బీహారున,కేరళ న నేలకోరుగుతున్న ఆ ప్రాణాలు నీ హిందూ రక్తాలవే……

మేలుకో!..
ఓ హిందూ సోదరా….

నువ్వొక వీరశివాజీ వై
నువ్వొక ప్రియ భారత ముద్దుబిడ్డవై
తిరగబడు తిరగబడు — నువ్వొక ఛత్రపతి వై…..

నాడు అస్తమించిన ఛత్రపతిని నేడు
నీలోపల ఉదయింపజెసి
తల్లి భారతి కన్నీళ్లు తుడవాల్సిన అత్యవసర సమయం ఇది….

అటు చూడు యరుపుల చేతుల్లో నెల కోరుగుతున్న
నీ భారత జాతి కీర్తి కిరీటం.

ఇటు చూడు ఆ సెక్యులర్ల చేతుల్లో నెలకోరుగుతున్న
నీ హైందవ జాతి చిహ్న ఆలయాలు.

నిండా వక్రీకరించిన భారత జాతి చరిత్రను
తిరగ రాసే వీర శివాజీ నువ్వే ……

బిగిసిన పిడికిలితో
ఉడికిన నెత్తురుతో
కదన రంగాన నిన్ను నువ్వు మరో శివాజీ లా నిలిపే
అత్యద్భుత అవకాశం…..

హిందూ సోదరా…. రా…
నీ కోసం ఎదురుచూస్తుంది భారత మాత…..
ఇంకో శివాజివై దేశ రక్షణ నీ బాధ్యతగా తిరగబడు

హిందూ సోదరా….రా….
ని రాకకై ఎదురు చూస్తోంది అఖండ హైందవ సైన్యం
ఇంకో వీర శివాజీ వై రా…
తల్లి భారతి కోసం… హైందవ జాతి కోసం….

శివాజీ చేతిలో కత్తి- నీ సంకల్పం ఒక్కటే అవ్వాలి…