అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
Chelluboyina Venu

Chelluboyina Venu : త్రినేత్రం న్యూస్ కడియం : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కడియపుసావరం గ్రామానికి చెందిన పార్టీ యువజన నాయకుడు జ్యోతుల వీరబాబు చిన్నమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను వేణు పరామర్శించారు. మాధవరాయుడుపాలెం గ్రామంలోని పార్టీ సీనియర్ కార్యకర్త సానబోయిన దుర్గ ప్రసాద్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు.

మురమండ గ్రామంలో ఎంపీటీసీ సభ్యులు మెల్లిమి గంగరాజు భార్య మెల్లిమి గంగ, సీనియర్ నాయకులు యర్ర సూర్యనారాయణ సోదరుడు యర్ర అరవాల రాజు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా గెడ్డం రమణ, వారణాసి తులసమ్మ, మగ్గం అబ్బాయి, నూకపొయ్యి నాగరత్నం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

దుళ్ల గ్రామంలో చాపల ముసలయ్య కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న సీహెచ్ ప్రసాద్ కుమార్తెను పరామర్శించారు. వేమగిరి గ్రామంలో సీనియర్ నాయకులు గుత్తుల బంగారయ్య కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు, మాజీ జిల్లా వ్యవసాయ మండలి సభ్యులు ఈలి గోపాలం, వేమగిరి సొసైటీ మాజీ అధ్యక్షులు వెలుగుబంటి అచ్చుత రామయ్య, పార్టీ సీనియర్ నాయకులు కట్టా జామిందర్, మురమండ మాజీ సర్పంచ్ అయినవిల్లి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు సంగీత వెంకటేశ్వరరావు, సంగీత రవితేజ, యర్ర సూర్యనారాయణ, అయినవిల్లి ప్రసాద్, బిళ్లకుర్తి చిన్నా, బలుగూరి గోవింద్, పైడిమల్ల సురేష్, గెడ్డం బుల్లిరాజు, వడ్డీ ప్రకాష్, బీరకా సత్యనారాయణ, తుల్లూరి సుబ్బారావు, కొప్పాక రమణ, బీసీ సెల్ అధ్యక్షులు టెకీ శ్రీను, చాపల చంద్రశేఖర్, పితాని హరికృష్ణ, గుత్తుల వెంకటేశ్వరరావు, కన్నా, ఎంపీటీసీ సాపిరెడ్డి కామేష్, తోరాటి శ్రీను, మార్గాని బలరామ్, చీకట్ల సత్యనారాయణ, గుత్తుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page