జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 15 at 19.10.50

TRINETHRAM NEWS

ఆర్జిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ కు భారతీయ స్ఫూర్తి సేవారత్న నేషనల్ అవార్డు

రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉ ద్యమాలకు మరియు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి పేద విద్యార్థులు అభ్యున్నతి కోసం పాటుపడిన సోషల్ యాక్టివిస్ట్ చంటి ముదిరాజ్ కు సోషల్ సర్వీస్ విభాగంలో భారతీయ స్ఫూర్తి సేవారత్న నేషనల్ అవార్డ్ పొందారు. చంటి ముదిరాజ్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్జీవోలో పనిచేస్తూ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంటి ముదిరాజ్ చేస్తున్న సేవలను గుర్తించి స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో హానర్ చంటి ముదిరాజ్ చేసిన సంఘ సేవ, సామాజిక సేవకు గుర్తించిన స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో హానర్ విశ్లేషించి గౌరవప్రదంగా భారతీయ స్ఫూర్తి సేవ రత్న నేషనల్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చంటి ముదిరాజ్ కు భారతీయ స్ఫూర్తి సేవారత్న నేషనల్ అవార్డు అందించారు. సామాజిక సేవలో ఎప్పుడు ముందుండే చంటి ముదిరాజ్ ప్రతి ఒక్కరికీ మానవ దృక్పథంలో తనవంతు సాకారం చేస్తూనే ఉంటారు. అటు ఆర్టీఐ సంస్థతో విధ్యారులకు విద్య పరంగా, ప్రజలకు, మహిళలకు అనేక రంగాల్లో సహాయాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా తన సేవలను గుర్తించి భారతీయ స్ఫూర్తి సేవరత్న నేషనల్ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డు పొందడం పట్ల అభిమానులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల రమేష్, ఆర్టీఐ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి,గంగా రజినీ ప్రియ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page