Revanth : చంద్రబాబును చర్చలకు పిలుస్తా: రేవంత్

TRINETHRAM NEWS

Trinethram News : రాజకీయంగా చచ్చిపోయిన బీఆర్ఎస్ గోదావరి నీళ్ల వివాదాన్ని పట్టుకుని మళ్లీ బతకాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో వ్యాఖ్యానించారు. హైకమాండ్‌తో చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన ఆయన హైదరాబాద్ తిరుగు పయనం అయ్యే ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు బనకచర్ల విషయంలో నేరుంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపుతున్నారని.. ప్రైమరీ ఫీజుబులిటీ రిపోర్టు కూడా ఇవ్వడంతోనే సమస్యలు వచ్చాయన్నారు.

కేంద్రం వద్దకు వెళ్లే ముందు తెలంగాణతో చర్చలు జరిపి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. ఈ అంశంలో తామే ఓ అడుగు ముందుకేస్తామని.. ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు పిలుస్తామన్నారు. 23వ తేదీన కేబినెట్ సమావేశం ఉందని.. అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎంను బనకచర్ల విషయంలో చర్చలకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. దిగువ రాష్ట్రమైన ఏపీకి హక్కులు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారని.. అవే హక్కులు తెలంగాణకు ఉంటాయన్నారు.

బనకచర్ల పేరు, అంచనాలు మారాయని గతంలోనే .. 2016, 2018లో చంద్రబాబు ప్రభుత్వం రెండు జీవోల ద్వారా గోదావరి నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభించిందన్నారు. దీనిపై వ్యాప్కోస్ కూడా నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు కేసీఆర్ సీఎం, హరీష్ రావు నీటి పారుదల మంద్రిగా ఉన్నారన్నారు. బనకచర్లపై చర్చల విషయంలో విమర్శలు వచ్చినా పట్టించుకోనని.. చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandrababu Naidu will be

You cannot copy content of this page

Scroll to Top