త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం రాజీపడని నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కొనియాడారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో బుధవారం మండపేట మండలం, కేశవరం గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన ఇంటింటా పర్యటించారు.
ప్రజలను నేరుగా కలుస్తూ రాష్ట్రంలో పాలన విధానంపై ప్రజలకు వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం ఫించన్లు పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికివందనం వంటి సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ రాష్ట్ర ప్రజలకు పక్షపాతిగా నిలిచారన్నారు. చంద్రబాబు ప్రజా పాలన పై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారని, ఏ ఇంటికెళ్లి విచారించినా, తమ పిల్లలకు తల్లికివందనం డబ్బులు అందాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


