ఇంకొల్లు సభలో చంద్రబాబు తన లాంగ్వేజ్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ అంతా మార్చేశారు. ప్రతీ మాటకూ దీర్ఘాలు తీసారు. బాబును ఆయన స్పీచ్ లను 1995 నుంచి చూస్తున్న వారికి ఇదొక కొత్త అనుభవమే. చంద్రబాబు అంటే సుదీర్ఘమైన ఉపన్యాసాలకు పెట్టింది పేరు.
సభలో తన అవేశాన్ని చూపించారు. ఏడున్నర పదుల వయసు ఉన్న నేత ఈయనేనా అనిపించేలా బాబు కనిపించారు. ఒక విధంగా విశ్వరూపమే చూపించారు.
ఈ సభంలో బాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆయన నా రాజకీయాల ముందు నువ్వొక బచ్చా అంటూ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నీ పులివెందుల కూడా మేం గెలవబోతున్నాం కాస్కో జగన్ మోహన్ రెడ్డీ అంటూ సవాల్ విసిరారు.
మేం మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డీ అంటూ చంద్రబాబు మండిపోయారు. ఈ మీటింగ్ చూసి జగన్ మోహన్ రెడ్డి ప్యాంట్ తడిసిపోయిందన్నారు..
చంద్రబాబులో ఇంతలా ఆవేశం ఈ మధ్యకాలంలో చూడలేదని తమ్ముళ్ళు అంటున్నారు. బాబు ఆవేశానికి వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ని పట్టుకుని బచ్చా అంటూంటే అచ్చా అంటున్నారు తమ్ముళ్ళు.
రాజకీయల్లో ఇలాంటి పదాలు మాట్లాడకపోవడమే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు…