
Trinethram News : పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరనే వార్త విని తీవ్ర విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు.
నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆయన చేసిన కృషి అసామాన్యమని చెప్పారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వనజీవి రామయ్య కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
