ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
Trinethram News : డిసెంబర్ 24
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ షెడ్యూల్ ను ఐసీసీ ఈరోజు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 22న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనుంది.మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
కాగా.. మ్యాచ్‌ల నిర్వహణ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించానున్నారు. మరోవైపు.. టీమిండియా మ్యాచ్‌లు విదేశాల్లోనే జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతాయి.
ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.. గ్రూప్-ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.
కాగా.. మార్చి 4న సెమీఫైనల్-(1) 5వ తేదీన సెమీ ఫైనల్ -(2), మార్చి 9న ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. సెమీ-ఫైనల్ మరియు ఫైనల్ రెండింటికీ రిజర్వ్ రోజులు ఉంటాయి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App